చిరు ‘కుర్ర’తనం.! వశిష్ట ఏం మాయ చేశాడో.!
- November 20, 2023
మెగాస్టార్ చిరంజీవి వయసు ఎన్ని వంతులు తగ్గిపోయిందో చెప్పలేకపోతున్నాం. అవునండీ పక్కా కుర్రాడిలా కనిపిస్తున్నాడు.
వశిష్ట సినిమాలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవిని యంగ్ లుక్స్‌లో చూపించబోతున్నాడట వశిష్ట.
అయితే, మొదట్లో ఈ సినిమాలోని చిరంజీవి లుక్స్ గురించి పలు రకాల చర్చలు వినిపించాయ్. చిరంజీవి మధ్య వయస్కడిలా కనిపిస్తారనీ, లేదు లేదు కాస్త వయసు మళ్లినట్లుగా కనిపిస్తారనీ.. ఇలా పలు రకాల గాసిప్స్ వినిపించాయ్.
కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే, చిరంజీవి పక్కా యంగ్ లుక్స్‌లో కనిపించబోతున్నారనీ తెలుస్తోంది.
అయితే, రెండు, మూడు వేరియేషన్లలో చిరంజీవి కనిపిస్తారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయ్. అసలు ఈ సినిమాకి హీరోయిన్ వుండదన్న ప్రచారం కూడా జరిగింది.
ప్రస్తుతానికి హీరోయిన్ వివరాలు తెలియవు కానీ, ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి, చిరంజీవి లుక్స్ పరంగా కానీ, హీరోయిన్ విషయంలో కానీ, వశిష్ట ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







