‘గుంటూరు కారం’ పక్కా తెలుగుతనం.!
- November 20, 2023
ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ సినిమా స్థాయి ఖండాలు దాటేస్తున్న ఈ తరుణంలో మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ మాత్రం పక్కా తెలుగుతనంతో తెరకెక్కుతోంది.
అయినా కానీ, ఈ సినిమాకి బీభత్సమైన బిజినెస్ జరుగుతోంది. విలువలతో కూడిన నిర్మాణంతో రూపొందుతోంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
సంక్రాంతి టార్గెట్‌గా వస్తోన్న ఈ సినిమాపై ఇంత క్రేజ్, బజ్ క్రియేట్ కావడానికి కారణం కాంబినేషన్‌కి వున్న క్రేజే. త్రివిక్రమ్, మహేష్ కాంబో అంటే ఆ క్రేజ్ వేరే లెవల్.
గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల రిజల్ట్ అలాంటిది. అందుకే ఇంత బజ్. సినిమా మొదలైన కొత్తల్లో అనేక రకాల సమస్యలు వెంటాడాయ్ ఈ సినిమాని.
దాంతో బోలెడంత నెగిటివిటీ మూటకట్టుకుంది. కానీ, ఆ నెగిటివిటీని పాజిటివ్ వైపుకు మళ్లించే దిశగా సినిమాని తయారు చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట.
ఖచ్చితంగా సంక్రాంతి బరిలో హిట్టు సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







