త్రిష‌తో ఆ సీన్లు.! ఏంటీ చిల్లరతనం పెద్దాయనా.!

- November 20, 2023 , by Maagulf
త్రిష‌తో ఆ సీన్లు.! ఏంటీ చిల్లరతనం పెద్దాయనా.!

తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్. సోషల్ మీడియా వేదికగా ఆయనను అంతా ఆడి పోసుకుంటున్నారు. ‘లియో’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం మన్సూర్ అలీ ఖాన్‌ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు.

ఇంతకీ ఆయన ఏం మాట్లాడారనీ..? విలన్‌గా పలు పాత్రలు పోషించిన మన్సూర్ అలీ ఖాన్ గతంలో చాలా చాలా రేప్ సీన్లలో నటించాననీ, కానీ, హీరోయిన్ త్రిష‌తో తనకు అలాంటి సీన్లు ఎప్పుడూ పడలేదనీ అన్నారాయన.

ఛి..ఛీ.! ఇవేం మాటలు అనిపిస్తోందా.? మరదే.! పెద్దాయన నోటికి కాస్త అదుపు హద్దులుండక్కర్లా.? తాజాగా ‘లియో’ సినిమాలోనూ ఆయన నటించారు. అయితే, ఈ సినిమాలో త్రిషను తన కంట పడనీయకుండా చేశారనీ అంటున్నారాయన.

అంటే, త్రిష‌తో కలిసి వున్న సీన్లు లేవని ఆయన మాటల్లోని అర్ధమట. అర్ధమేదైనా ఒక వయసుకొచ్చాకా.. కాస్తంత సంస్కారం వుండక్కర్లా.? త్రిష వంటి ఓ స్టార్ ఇమేజ్ వున్న హీరోయిన్‌ని పట్టుకుని ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారా.? అని స్వయానా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఆయన మాటల్ని తప్పు పడుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com