అసెంబ్లీ ఎన్నికలవేళ ఐదు రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల నగదు సీజ్..

- November 20, 2023 , by Maagulf
అసెంబ్లీ ఎన్నికలవేళ ఐదు రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల నగదు సీజ్..

భారత దేశంలోని తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎంత సొమ్ము పట్టుబడిందనే విషయాలను సోమవారం ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో 1,760 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏడు రెట్లు డబ్బు, మద్యం ప్రభావం పెరిగిందని అన్నారు. 2018లో ఐదు రాష్ట్రాల్లో రూ. 239.15 కోట్లు పట్టుబడితే ప్రస్తుతం 1,760 కోట్లకు సీజ్ చేసిన మొత్తం చేరిందని తెలిపారు. గుజరాత్, హిమాచల్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 1400 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా..ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు.. ఎన్నికల వ్యయ మానిటరింగ్ సిస్టమ్ (ESMS) ద్వారా పర్యవేక్షణ ప్రక్రియలో సాంకేతికతను ఈసీ పొందుపరిచింది. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులు, విలువైన వస్తువుల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో 659.2 కోట్ల విలువ గల నగదు, వస్తువులను సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణ లో పట్టుబడిన రూ. 659.2 కోట్లలో.. 225.23 కోట్ల నగదు ఉండగా.. రూ. 86.82 కోట్ల విలువైన మద్యం, రూ. 103.74 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 191.02 కోట్ల విలువైన వస్తువులు, రూ. 52.41 కోట్ల విలువైన ఉచిత బహుమతులు ఉన్నాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్ రాష్ట్రంలో.. డబ్బు, మద్యం, డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో రాజస్థాన్ నిలిచిందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాజస్థాన్ లో రూ. 650.7 కోట్ల విలువైన నగదును సీజ్ చేయగా.. అందులో రూ. 93.17 కోట్ల నగదు, రూ. 51.29 కోట్ల విలువైన మద్యం, రూ. 91.71 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 73.36 కోట్ల విలువైన వస్తువులు, రూ. 341.24 కోట్ల విలువైన ఉచిత బహుమతులు ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో.. రూ. 33.72 కోట్ల నగదు, 69.85 కోట్ల విలువైన మద్యం, 15.53 కోట్ల విలువైన డ్రగ్స్, 84.1 కోట్ల విలువైన వస్తువులు, 120.53 కోట్ల విలువైన ఉచిత బహుమతులు సీజ్ చేశారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మొత్తం 76.9 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మిజోరాం రాష్టంలో రూ. 49.6 కోట్ల విలువైన డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులు, విలువైన వస్తువులు సీజ్ చేసిన ఎన్నికల సంఘం అధికారులు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com