బ్రిటన్ లో ఈ ఐదు వృత్తుల వారికి సులభంగా వర్క్ వీసా..!
- November 20, 2023
లండన్: భారత సంతతి వారు అధికంగా ఉండే దేశాల్లో బ్రిటన్(UK) కూడా ఒకటి. బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇంగ్లండ్, వేల్స్‌లో ఉంటున్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారే! వీరిలో భారతీయుల వాటానే అధికం. దీనికి తోడు గతేడాది బ్రిటన్ జారీ చేసిన విద్య, ఉద్యోగ, పర్యాటక వీసాల్లో అధికశాతం భారతీయులే దక్కించుకున్నారు. 2020లో బ్రిటన్ ప్రభుత్వం పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా పునఃప్రారంభించింది. దీంతో, బ్రిటన్ వెళ్లే భారతీయుల సంఖ్య 2021తో పోలిస్తే 2022లో ఏకంగా 63 శాతం మేర పెరిగింది. అయితే, చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం సంపాదించడం సవాళ్లతో కూడుకున్నదే. కానీ, కొన్ని వృత్తుల్లో వారికి బ్రిటన్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో సులువుగా వీసా, ఆ తరువాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెప్పే మాట.
బ్రిటన్‌లో నర్సులు, ఫార్మసిస్టులు, కేర్ వర్కర్లు వంటి ఆరోగ్య రంగ నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఈ వృత్తుల వారికి కాస్తంత సులభంగా స్కిల్డ్ వర్కర్ వీసా దొరికే అవకాశం ఉంది.
సాప్ట్‌వేర్ ఇంజినీరింగ్‌తో పాటూ సంప్రదాయిక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లకు బ్రిటన్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ వచ్చే ఐదేళ్లల్లో ఏటా 2.7 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా.
ఐటీ బిజినెస్ అనలిస్టులు, ఆర్కిటెక్టులు, సిస్టమ్ డిజైనర్లు, వంటి వారికి కూడా డిమాండ్ అధికంగా ఉంది. వచ్చే నాలుగేళ్లల్లో ఈ రంగంలో 5,200 కొత్త జాబ్స్ అందుబాటులోకి వస్తాయి.
ఇక సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులకు ఎప్పటిలాగే డిమాండ్ కొనసాగుతుంది. ఈ రంగంలో వచ్చే నాలుగేళ్లలో 12,500 కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. యాక్చువరీస్, ఎకనామిస్ట్స్, స్టాటిస్టీషియన్స్ వంటి వారికీ డిమాండ్ పెరుగుతందని, 2027 నాటికి గణిత ఆధారిత నిపుణులకు 23,300 కొత్త జాబ్స్ అందుబాటులోకి వస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి, విద్యార్థులు తమ అభిరుచి, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకుంటే విదేశాల్లో బంగరు భవిష్యత్తు సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!