విదేశాలకు వెళ్లే వారికి ముఖ్య గమనిక..

- November 21, 2023 , by Maagulf
విదేశాలకు వెళ్లే వారికి ముఖ్య గమనిక..

న్యూ ఢిల్లీ: విదేశాలకు వెళ్లేవారు ఇలాంటి విషయాలను తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే.. ప్రయాణీకుడు నిర్దిష్ట పరిమితిలోపు మాత్రమే వస్తువులు, నగదును తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అలాకాకుండా పరిమితికి మించి తీసుకెళ్లినా ఇంటికి పంపిస్తారు. కాబట్టి, ప్రయాణానికి ముందు అలాంటి నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి. వెళ్లిన చోట ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొకుండా ఉండేందుకు పర్యాటకులు వీలైనంత ఎక్కువ నగదును తమ వద్ద ఉంచుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే కొంత పరిమితిలోపు నగదును తీసుకెళ్లాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళీకృత రెమిటెన్స్ పథకం ప్రకారం, భారతీయ ప్రయాణికులు కేవలం రూ. 1.89 కోట్లు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది.

నేపాల్, భూటాన్ వంటి కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలకు ప్రయాణించే ప్రయాణీకులు ఒక ప్రయాణానికి $3000 వరకు విదేశీ కరెన్సీని తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది.. మీరు ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లాలనుకుంటే, మీరు దానిని స్టోర్ వాల్యూ కార్డ్, ట్రావెలర్స్ చెక్, బ్యాంకర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకెళ్లవచ్చు.

ఒక భారతీయ యాత్రికుడు నేపాల్, భూటాన్ కాకుండా మరే ఇతర దేశానికి తాత్కాలిక పర్యటనకు వెళ్తున్నట్టయితే.. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు భారతీయ కరెన్సీ నోట్లను తిరిగి తీసుకురావచ్చు. అయితే ఈ మొత్తం రూ.25 వేలకు మించకూడదని గుర్తుంచుకోవాలి. నేపాల్, భూటాన్ గురించి చర్చించుకున్నట్టయితే.. అక్కడ నుండి తిరిగి వచ్చే సమయంలో ఎవరూ భారత ప్రభుత్వ కరెన్సీ నోట్లను 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన RBI నోట్లను తీసుకెళ్లలేరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com