స్పార్క్’ మెహ్రీన్ ఇకపై అయినా షైన్ అవుతుందా.?
- November 22, 2023
‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిరీస్‌లతో హిట్టు కొట్టిన హిస్టరీ వున్నప్పటికీ మెహ్రీన్ కౌర్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే నడుస్తోంది.
తాజాగా ‘స్పార్క్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రోమోస్‌తో తెగ ఊదరగొట్టేసింది మెహ్రీన్ కౌర్. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. నిజంగానే ఈ సినిమా ప్రోమో పోస్టర్లలో వావ్ అనిపించింది మెహ్రీన్.
అయితే, సినిమా రిలీజ్ అయ్యాకా పెద్దగా పట్టించుకోలేదెవ్వరూ. అయినా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా పాట్లు పడుతూనే వుంది మెహ్రీన్ కౌర్. అందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోస్తూ స్పెషల్ ఫోటో షూట్‌కి తెర లేపింది.
ఈ ఫోటోలైతే వైరల్ అవుతున్నాయ్ కానీ, ‘స్పార్క్’ సినిమాని మాత్రం పట్టించుకోవడం లేదెవ్వరు. ఇదిలా వుంటే, మరోవైపు మెహ్రీన్ ఓటీటీ పైనా బాగానే ఫోకస్ పెట్టిందండోయ్.
‘సుల్తాన్ ఆప్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఈ సిరీస్‌లో మెహ్రీన్ ఓ స్టన్నింగ్ రోల్లో కనిపించి అదరగొట్టేసింది. అంతేకాదు, హాట్ హాట్ సన్నివేశాల్లోనూ అలవోకగా నటించేసింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







