వారంలో 1,600 ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్.. ఐఫోన్ 15 గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు
- November 23, 2023
యూఏఈ: యూఏఈలోని ఒక సెక్యూరిటీ గార్డు బ్రాండ్-న్యూ ఐఫోన్ 15 బహుమతిగా పొందాడు. నేపాల్ ప్రవాసుడు దీపేష్ చమ్లాగైన్ ఈ బహుమతిని పొందేందుకు ఒక వారంలో దాదాపు 1,600 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేశాడు. టెక్నాలజీ కంపెనీ రెనీ ఈ బహుమతిని అందజేసింది. ఈ సందర్భాం దీపేష్ మాట్లాడుతూ.. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎలా హాని కలిగిస్తుందో ఆలోచించకుండా ప్రజలు ప్లాస్టిక్ని ఎలా విసిరివేయడం తనకు ఎప్పుడూ నచ్చలేదన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది సహాయంతో తాను బాటిళ్లను సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెనీ సంస్థ యూఏఈ అంతటా 1,000 స్మార్ట్ బిన్లను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక ప్లాస్టిక్ సీసాని రీసైకిల్ చేసిన తర్వాత, అది అతని/ఆమె ఖాతాలో నమోదు చేయబడుతుందని, పర్యావరణ సృహను ప్రొత్సాహించేందుకు డ్రా నిర్వహించిన విజేతలకు బహుమతులను అందజేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శాండర్ వాన్ వేస్ వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..