వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ఒమన్

- November 23, 2023 , by Maagulf
వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ఒమన్

మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ సంబంధాలు, ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయీద్ G20 నాయకుల వర్చువల్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. నవంబర్ 22(బుధవారం)  భారత ప్రధాన మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిస్ హైనెస్ సయ్యద్ అసద్ న్యూ ఢిల్లీలో G20 నాయకుల డిక్లరేషన్ తుది ప్రకటనను విజయవంతంగా జారీ చేసినందుకు హిస్ మెజెస్టి ది సుల్తాన్ తరఫున అభినందనలు తెలియజేశారు. ఇది ఆర్థిక వృద్ధిలో G20 ప్రయోజనాలను ప్రతిబింబిస్తుందన్నారు. స్థిరత్వం, అందరి ప్రయోజనం కోసం ప్రపంచీకరణ పని చేయడం, పర్యావరణంపై ఫోకస్ పెట్టడం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడం, ప్రపంచ నిర్ణయాధికారంలో G20లో అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్‌ని బలోపేతం చేస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com