విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలకు కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు

- November 23, 2023 , by Maagulf
విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలకు కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: విశాఖలో ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం భవనాలకు కేటాయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శలకు  భవనాలను కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం శాఖలకు భవనాలను కేటాయించింది అని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయ, విడిది అవసరాలకు భవనాల కేటాయింపులు జరిగాయని..35 శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సూచించింది. మిలీనియం టవర్స్ లోని ఏ, బీ బ్లాక్ భవనాలు, ఆంధ్రా యూనివర్శిటీ, రుషి కొండ, చినగదిలి, ఎండాడ తదితర ప్రాంతాల్లో భవనాలను కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో ఈ భవనాలు ఉండనున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా..ఇక విశాఖ నుంచే పరిపాలన అనే అంశంలో ఇది కీలక పరిణామం అనే చెప్పాలి. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఆయా శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలన్నారు.

సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం సీఎం, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com