క్యాన్సర్ ఛారిటీకి జుట్టును డొనేట్ చేసిన 11 ఏళ్ల బాలిక
- November 24, 2023
బహ్రెయిన్: ది ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB)లో 5వ తరగతి చదువుతున్న తమన్నా మనేష్ కుమార్ తన 29-సెంటీమీటర్ల పొడవాటి జుట్టును బహ్రెయిన్‌లోని క్యాన్సర్ రోగులకు డొనేట్ చేసి తన దయాగుణాన్ని చాటుకుంది. ఆమె తన కుటుంబంతో కలిసి జుఫైర్‌లో నివసిస్తోంది. తమన్నా విరాళంగా ఇచ్చిన జుట్టు కీమోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ పేషెంట్ల కోసం విగ్లను రూపొందించడానికి ఉపయోగించనున్నారు. అద్లియాలోని బహ్రెయిన్ క్యాన్సర్ సొసైటీ అధికారులకు జుట్టును అధికారికంగా అందజేశారు. చిన్న వయస్సులోనే ఇలాంటి దయాగుణంతో కూడిన చర్యలను తమ కుమార్తె అర్థం చేసుకున్నందుకు గర్విస్తున్నట్లు తమన్నా తల్లిదండ్రులు తెలిపారు. ఐఎస్బి గౌరవ చైర్మన్, ప్రిన్స్ ఎస్. నటరాజన్, గౌరవ కార్యదర్శి సాజి ఆంటోని, ప్రిన్సిపల్ వీఆర్ పళనిస్వామి తమన్నాను అభినందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..