దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్ట్‌కు ఆమోదం

- November 25, 2023 , by Maagulf
దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్ట్‌కు ఆమోదం

దుబాయ్: 30కిమీ దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్ట్‌కు యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 1 మిలియన్ ప్రజలకు విస్తృత సేవలను అందించనుంది. ఎమిరేట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో సరికొత్త ప్రాజెక్ట్ 18 బిలియన్ దిర్హామ్‌లతో నిర్మించబడుతుందని షేక్ మొహమ్మద్ ట్విటర్(ఎక్స్)లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రెడ్ మరియు గ్రీన్ మెట్రో లైన్లకు బ్లూ లైన్ ను అనుసంధానం చేయనున్నారు.  దీని మొత్తం పొడవు 30 కి.మీ ఉంటుంది, ఇందులో 15.5 కి.మీ భూగర్భంలో ఉంటుంది (70 మీటర్ల లోతులో) మరియు 14.5 కి.మీ ఎలివేటెడ్ రైలు ఉంటుంది. బ్లూ లైన్ సేవలు దుబాయ్ ఫెస్టివల్ సిటీ, దుబాయ్ క్రీక్ హార్బర్, ఇంటర్నేషనల్ సిటీ, అల్ రషీదియా, అల్ వార్కా, మిర్డిఫ్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, అకాడెమిక్ సిటీ ఇతర పొరుగు ప్రాంతాలకు అందుబాటులో ఉండనున్నాయి. 2029 నాటికి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజూ దాదాపు 320,000 మంది కొత్త ప్రయాణీకులకు సేవలు అందిస్తుందన్నా పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com