రాగి పాత్రలో వుంచిన నీళ్లు ఆరోగ్యానికి మంచివే.! కానీ.!

- November 25, 2023 , by Maagulf
రాగి పాత్రలో వుంచిన నీళ్లు ఆరోగ్యానికి మంచివే.! కానీ.!

రాత్రి పూట రాగి గ్లాసులో నీళ్లు నింపి, తెల్లారి లేవగానే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది నమ్ముతుంటారు. అవును నిజమే, రాగి పాత్రలో వుంచిన మంచి నీళ్లు ఆరోగ్యానికి మంచివే. అలా తాగడం వల్ల కడుపు, మూత్ర పిండాలు, కాలేయం శుద్ధి చేయడానికి సహాయ పడుతుంది. తద్వారా ఆరోగ్యం మన సొంతమవుతుంది. కానీ, రాగి పాత్రలో కొన్ని ఆహార పదార్ధాలను నిల్వ చేయరాదు.
అలా నిల్వ చేసిన వాటిని అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పాత్రలో వుంచిన పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పాలు, ఫాల ఉత్పత్తులు అంటే పెరుగు మజ్జిగ తదితర ఆహార పదార్ధాలు రాగి పాత్రలో నిల్వ చేయడం వల్ల వాటిలోని ఖనిజాలు రాగితో కెమికల్ రియాక్షన్ జరుపుతాయ్.
తద్వారా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలున్నాయ్. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తి తీవ్రమైన నీరసం ఆవహిస్తుంది. అలాగే, రాగి పాత్రలో పచ్చళ్లు గట్రా నిల్వ చేయరాదని ఓ సర్వేలో తేలింది.
రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు ఆరోగ్యానికి మంచివి కదా అని.. అన్ని రకాల పదార్ధాలూ మంచివే అనుకుంటే పొరపాటే సుమండీ. కేవలం PH స్థాయి 6.0 కన్నా తక్కువ వున్న ఆహార పదార్ధాలను మాత్రమే రాగి పాత్రలో నిల్వ చేయాలి.. అని రీసెంట్‌గా ఓ సర్వేలో తేలింది. సో, రాగి పాత్రలను ఆహారానికి ఉపయోగించే క్రమంలో  జాగ్రత్తలు తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com