JEE అడ్వాన్స్‌డ్ 2024 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్...

- November 25, 2023 , by Maagulf
JEE అడ్వాన్స్‌డ్ 2024 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్...

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2024 తేదీని ప్రకటించింది. పరీక్ష మే 26, 2024న రెండు సెషన్‌లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9-12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30-5:30 గంటల వరకు జరుగుతాయి. JEE అడ్వాన్స్‌డ్ 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్ 21, 2024న ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 30, 2024 వరకు కొనసాగుతాయి.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు. బీటెక్ ప్రోగ్రామ్ కోసం దేశంలోని ప్రీమియర్ ఐఐటీలు, ఇతర ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

అభ్యర్థులు ఫీజు చెల్లింపుకు గడువు మే 6, 2024.గా నిర్ణయించారు. అభ్యర్థులు చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్‌లు మే 17, 2024 నుండి మే 26, 2024 వరకు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. తాత్కాలిక సమాధానాలతో కూడిన కీ జూన్ 2, 2024న విడుదల చేస్తారు. JEE అడ్వాన్స్‌డ్ 2024 ఫైనల్ ఆన్సర్ కీతోపాటు, ఫలితాలు జూన్ 9, 2024న ప్రకటిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com