బన్నీ-త్రివిక్రమ్.! ఈ సారి సోషియో ఫాంటసీ.!

- November 25, 2023 , by Maagulf
బన్నీ-త్రివిక్రమ్.! ఈ సారి సోషియో ఫాంటసీ.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అంత వరకూ ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న బన్నీకి ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే, ఈ సారి కూల్ అండ్ లవ్లీ ఫ్యామిలీ స్టోరీ కాకుండా సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశాడట బన్నీ కోసం త్రివిక్రమ్. అసలే బన్నీ ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడు.. ఆ ఇమేజ్‌ని మ్యాచ్ చేసేలా ఈ సినిమా బడ్జెట్ వుండబోతోందట.
సినిమా అయితే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాతోనూ, అల్లు అర్జున్ ‘పుష్ప 2’తోనూ బిజీగా వున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేశాకే ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేది. అందుకు దాదాపు ఏడాదిన్నర వరకూ సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సారి ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా అంటే అస్సలు మామూలుగా వుండదు.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com