హాయ్ నాన్న.! సెంటిమెంట్ పిండేశావ్ నానీ.!
- November 25, 2023
‘దసరా’ సినిమాతో నాని సూపర్ హిట్ కొట్టాడు. సినిమా ప్రమోషన్లలోనే నాని నమ్మకం పెంచేశాడు. చెప్పినట్లుగానే సినిమా అందరికీ నచ్చింది. సూపర్ హిట్ కట్టబెట్టారు. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ సినిమాతో రాబోతున్నాడు నాని.
డిశంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్గా వచ్చిన ‘హాయ్ నాన్న’ ట్రైలర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ తరహా సెంటిమెంట్ సినిమాలు చాలానే వచ్చాయ్. కానీ, ‘హాయ్ నాన్న’ సినిమాతో నాని ఏదో కొత్తగా చెప్పబోతున్నాడని ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు.
డైలాగులు బాగున్నాయ్. తండ్రీ కూతురు మధ్య సాగే సెంటిమెంట్ ఆధ్యంతం ఆసక్తికరంగా వినోదం పంచుతూనే హృద్యంగా సాగింది. కొత్త గెటప్‌లో కనిపిస్తూ నాని తనదైన పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో.
మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంతవరకూ ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన ప్రోమోలు పాజిటివ్ సైన్ తీసుకోగా, తాజా ట్రైలర్ ఆ అంచనాల్ని ఆకాశానికంటేలా చేసింది.
ట్రైలర్ కట్ చేసిన విధానం బాగుంది. చూడాలి మరి, సినిమా ఎలా వుండబోతోందో.! నానికి సక్సెస్ కంటిన్యూ అవుతుందో లేదో.!
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







