డెస్క్ టాప్ ప్రకటనలకు గుడ్ బై..
- May 26, 2016
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఎఫ్ బీఎక్స్ సర్వీసులను ఉపసంహరించు కున్నట్టు ఈ మెయిల్ ద్వారా తెలిపింది. డెస్క్ టాప్ ప్రకటనలకు గుడ్ బై చెప్పినట్టు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్ ఇదెమా తెలిపారు. వ్యాపారమంతా అరచేతిలోనే అన్నట్టుగా మారడంతో ఫేస్ బుక్ డెస్క్ టాప్ ప్రకటనలను రద్దుచేసింది. తమ సేవలను మొబైల్ ద్వారా అందించే వ్యూహంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ వెల్లడించింది. 2012లో లాంచ్ చేసిన ఎఫ్ బీఎక్స్ ద్వారా డెస్క్‌టాప్ ప్రకటనలను కొనుగోలుకు విక్రయదారులకు అనుమతిస్తుంది. ప్రభావవంతమైన మార్కెటింగ్ ప్రచారాల్లో మొబైల్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని కంపెనీ తెలిపింది. డైనమిక్ ప్రకటనలు కస్టమ్ ఆడియన్స్ కోసం మొబైల్ ప్రకటనల వైపు మళ్లనున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా పెరుగుతున్న మొబైల్ ఆదరణ నేపథ్యంలో విక్రయదారుల ప్రకటనలకు సమర్థవంతంగా ఫార్మాట్లను అందించడంలో నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలనే వ్యూహంలో భాగమే ఈ చర్య అని స్పష్టం చేసింది. కాగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే క్రమంలో తన ఆడియన్స్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం ద్వారా వీడియో సెల్లింగ్ పద్ధతిని ఫేస్ బుక్ ఇప్పటికే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









