ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌కు పోటెత్తిన పర్యాటకులు
- November 26, 2023
ఇబ్రా: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని విలాయత్లకు 53వ జాతీయ దినోత్సవ సెలవుల సందర్భంగా గత నాలుగు రోజులుగా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సందర్శకులు ఇసుక తిన్నెలలో ఎండ్యూరెన్స్ అరేబియా ఒంటె రేస్, అల్ అర్ధ ఒంటెల ప్రదర్శన, గ్రూప్ క్యాంపింగ్ కార్యకలాపాలు, ఇసుక దిబ్బలపై నడవడం మరియు ఒంటెల స్వారీ వంటి అనేక కార్యకలాపాలను ఆస్వాదించారు. వాడి బని ఖలీద్ యొక్క విలాయత్ లో ఉన్న సరస్సులను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అలాగే ఇబ్రా, అల్ ముదైబి, దిమా వాల్ తైన్, అల్ ఖబిల్ మరియు సినావ్ యొక్క విలాయత్లను కూడా పర్యాటకులు పెద్దఎత్తున సందర్శించారు. ఈ విలాయాట్లలో పర్యాటకులు వాడీలు, నీటి బుగ్గలు, కోటలు మరియు పాత సౌక్లను సందర్శించారు. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని హెరిటేజ్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ సుమైయా బింట్ హమద్ అల్ బుసైది మాట్లాడుతూ.. వివిధ రంగాల సహకారంతో గవర్నరేట్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఎడారి, పర్వతం మరియు నీటి అడ్వెంచర్ టూరిజంకు సంబంధించిన కాలానుగుణ కార్యకలాపాలను సందర్శకులు ఆస్వాదించారని పేర్కొన్నారు. ఉత్తర అల్ షర్కియాలో పర్యాటక సీజన్ సందర్భంగా హోటల్ గదుల ఆక్యుపెన్సీ 60 నుండి 90 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..