దుబాయ్ లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
- November 27, 2023
దుబాయ్: దుబాయ్ లోని అల్ ఘిసైస్ ప్రాంతంలో గల మాయామణి హాల్ లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతా కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడ్డ ఈ కార్యక్రమం ఉదయం గణపతి పూజ తో మొదలై మధ్యాహ్నం మంగళాశాసనం తో ముగిసింది.వేదోక్త ప్రకారంగా మొదలైన ఈ కార్యక్రమం విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మి అష్టకం, పురుష సూక్త సహిత అభిషేకం తో కొనసాగింది. ముందుగానే రిజిస్టర్ చేసుకున్న 45 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అనంత కృపా కటాక్షానికి పాత్రులైయ్యారు.కన్నుల పండుగగా జరిగిన పూజ లో పాల్గొన్న జంటలు తిరుపతి లడ్డు ప్రసాదం, అన్నవరం సత్యదేవుని బంగీ ప్రసాదం అందుకున్నారు.ముకుంద్ కౌశిక్.బి అయ్యంగార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ ఈ కార్యక్రమం సీతా కమిటీ సభ్యులు అశోక్ కుమార్, రంగనాథ్, సి.వెంకటేశ్వరరావు, పీ.వేంకటేశ్వర రావు, సి.హెచ్.నాగరాజు, ఆర్. భరత్ ,ఊర కృష్ణ, వసుధా గుప్తా మరియు ప్రశాంత్ సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ముగిసింది.
_1701027140.jpg)
_1701027022.jpg)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







