గాజా ఒప్పందంపై అమీర్, బైడెన్ సమీక్ష
- November 27, 2023
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ జో బిడెన్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలపై సమీక్షించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్,ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్(హమాస్) మధ్య కుదిరిన మానవతా విరామ ఒప్పందం అమలుపై చర్చించారు. గాజా స్ట్రిప్‌లో తీవ్రతను తగ్గించడానికి, పౌరులను రక్షించడానికి, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించడానికి మరియు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని పెంచడానికి ఉమ్మడి అంతర్జాతీయ ప్రయత్నాలపై చర్చించారు. ఆదివారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్.. హిస్ హైనెస్ కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల