నయన తారకు హీరో కావాలట.!
- November 28, 2023సౌత్ క్వీన్ నయన తారకు టాలీవుడ్‌లో ఓ మంచి హీరో కావాలట. అదేంటీ.! నయన తారకు హీరో కావాలేమిటి.? ఏంటి దీని అర్ధం.. అంటారా.? అదేనండీ.! నయన్ భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట.
ఆ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఓ టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకుంటున్నాడట.
ఆ బాధ్యతని భార్య నయన తారకు అప్పగించాడట. ఆమె అదే పనిలో బిజీగా వుందట. ఓ మినిమమ్ గ్యారంటీ హీరో కోసం నయన తార వెతుకులాట ప్రారంభించిందనీ సమాచారం.
ఈ సినిమాకి నయన తార నిర్మాతగా వ్యవహరించనుందట. ప్రస్తుతం నయన తార బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. తొలి ప్రయత్నమైన ‘జవాన్’ సూపర్ హిట్ అయ్యింది. దాంతో బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయట నయన తారకు.
దాంతో, సౌత్ సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టి బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాకి నయన తార సైన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం