ఓటీటీలపై ‘కాంతార’ హీరో గుస్సా.!
- November 29, 2023
ఓటీటీ ట్రెండ్ వచ్చాకా సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోందనే చెప్పొచ్చు. మంచి ఆదరణ అనే కన్నా.. మంచి సినిమాలకు తగిన ఆదరణ అనడం సబబేమో.
కొన్ని సినిమాలను ధియేటర్లకు పోయి ఏం చూస్తామ్‌లే.. అనుకుని లైట్ తీసుకుంటాం. ఒకవేళ మంచి కంటెంట్ అయినా సరే, అదే అభిప్రాయంతో ఆ సినిమాలు మరుగున పడిపోతుంటాయ్.
అలాంటి మంచి కంటెంట్ వున్న సినిమాలకు ఓటీటీ వల్లనే ఆదరణ దక్కుతోంది. ఖచ్చితంగా ఇది నిక్కర్చయిన నిజం అనడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.
అయితే, కన్నడ సినిమాలను ఓటీటీలు ఎక్కువగా ఆదరించడం లేదు.. అంటూ కన్నడ స్టార్ ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశాడంటూ ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
నిజానికి కన్నడ, తమిళ, మలయాళం.. ఇలా భాష ఏదైనా సరే, కంటెంట్ వుంటే.. ఆ సినిమాలను ఆదరిస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు. మరి, రిషబ్ శెట్టి ఏం మాట్లాడారో.. ఎలా మాట్లాడారో తెలీదు కానీ, ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలే చేసి వుంటే ఆ వ్యాఖ్యల్లో అర్ధం లేదు.
కొన్ని సినిమాలు ధియేటర్లలో ఫెయిలైనా.. ఓటీటీల్లో సెన్సేషనల్ అవుతుండడం చూశాం. చూస్తున్నాం.. కన్నడ సినిమాలను కొన్ని ఓటీటీ ఛానెళ్లు కొనడానికి వెనుకాడుతున్నాయ్ అనేది రిషబ్ శెట్టి అభిప్రాయమని తెలుస్తోంది. ఏమో.! ఆయన అభిప్రాయమేదైనప్పటికీ ఓటీటీ ట్రెండ్ వల్లనే అన్ని భాషా సినిమాలకు సమానమైన ఆదరణ దక్కుతోంది. ఇది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







