సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్.! ఎవరు గెలుస్తారో తేలిపోతుంది.!
- November 30, 2023
ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత వెల్లడయ్యే అవకాశం వుంది. ఇప్పటికే చాలా సర్వేలు శాంపిల్స్ తీసేసుకోగా, పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఓటర్ల మొబైల్ పోన్లకు కాల్స్ వెళుతున్నాయి.
‘మీరు ఎవరికి ఓటు వేశారు.?’ అంటూ ఐవీఆర్ కాల్స్ వస్తుండడంతో ఓటర్లకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. పోలింగ్ బూతులకు సమీపంలో కూడా ఓటర్లను ఈ ‘శాంపిల్స్’ కోసం ఇబ్బంది పెడుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తోన్న సంస్థలు.
సాయంత్రం మీడియా సమావేశం.. అంటూ ఆయా సంస్థలు, మీడియాకి కూడా సమాచారం పంపేశాయి ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడికి సంబంధించి. ఇటీవలి కాలంలో ఇదో కొత్త ఒరవడి అనుకోవాలేమో.!
కాగా, సర్వేల పేరుతోనూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న తీరు చూసి, ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు.
ఇదిలా వుంటే, మేమే గెలుస్తాం.. అంటూ ఆయా పార్టీలు ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఫేక్ సర్వేలను తమ అనుకూల మీడియా సంస్థల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళి, ఓటర్లను అయోమయంలో పడేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









