వద్దు బాబోయ్ వద్దు.. ఆ డైరెక్టర్‌తో సినిమా వద్దే వద్దంటోన్న ఫ్యాన్స్.!
- December 02, 2023
ప్రేమంటే పిచ్చి.. ప్రేమంటే ఇంకోటీ.. అనే అర్ధాలు చాలానే విన్నాం. కానీ, ఇదేం ప్రేమరా బాబోయ్.! అనుకునేలా తండ్రి మీద ప్రేమని చూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో.
విధ్వంసం అంటే ఇంతలా వుంటుందా.? మరీ డైరెక్షన్లో ఇంత కఠినత్వమా.? కఠినత్వం కాదు, మూర్ఖత్వం.. కాదు కాదు ఇంకేదో పేరు పెట్టాలి.. ఈ డైరెక్షన్‌కి.
సినిమా అంటే అర్ధమిదేనా.? సినిమా ద్వారా సందేశాలివ్వకపోయినా ఫర్వాలేదు. కానీ, ఇంతటి విధ్వంసాన్ని రెచ్చగొట్టేలా అస్సలుండకూడదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్ ‘యానిమల్’ సినిమాపై.
‘యానిమల్’, అర్జున్ రెడ్డీ’ ఒక్కటేనా.? అన్నందుకు మొన్న ఓ సినీ జర్నలిస్టుని ఏకి పారేశారంతా. కానీ, ‘అర్జున్ రెడ్డి’ ఒకింత యూత్ ఫుల్ మూవీ. కేవలం యూత్ కోసమే.. అనేస్తే కాస్త ఓకే. కానీ, ‘యానిమల్’ని ఎవరి కోసం సినిమా.? అనాలో అర్ధం కాని పరిస్థితి.. అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రబాస్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. అదే ‘స్పిరిట్’. కానీ, ఈ సినిమా చూశాకా, ‘స్పిరిట్’లో ప్రబాస్‌ని ఇంకెలా చూపిస్తాడో అంటూ ప్రబాస్ ఫ్యాన్సే భయపడిపోతున్నారు. వద్దు బాబోయ్ వద్దు సందీప్‌తో సినిమా చేయనే వద్దు అంటూ ప్రబాస్‌ని హెచ్చరిస్తున్నారట.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు