నీటి కొరత ఉన్న దేశాలకు క్లౌడ్-సీడింగ్ టెక్నాలజీ అందజేస్తాం: యూఏఈ

- December 03, 2023 , by Maagulf
నీటి కొరత ఉన్న దేశాలకు క్లౌడ్-సీడింగ్ టెక్నాలజీ అందజేస్తాం: యూఏఈ

యూఏఈ: క్లౌడ్ సీడింగ్‌లో పురోగతిని దృష్టిలో ఉంచుకుని, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో నీటి కొరతను పరిష్కరించడంలో సహాయం చేయడానికి సాంకేతికత పరిజ్ఞానాన్ని పంచుకుంటామని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఒమర్ అల్ యాజీదీ స్పష్టం చేశారు. దుబాయ్ లో ప్రస్తుతం UN ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UN ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్) 28వ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాలలో నీటి భద్రత పరిష్కారాల కోసం $150 మిలియన్ల కొత్త నిధులను కేటాయిస్తామని యూఏఈ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా క్లౌడ్-సీడింగ్ లో యూఏఈ మెరుగైన ప్రగతిని సాధించిందని అల్ యాజీదీ పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అధిక నీటి ఎద్దడిని ఎదుర్కొంటారని అంచనా. క్లౌడ్ సీడింగ్ ద్వారా  వర్షపాతాన్ని 15 నుండి 25 శాతం పెంచవచ్చు. ఇది భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి, మంచినీటి సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది స్థానిక వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆహార భద్రతను పెంచుతుందని అల్ యాజీదీ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com