కుప్ప కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్లు మృతి
- December 04, 2023
తెలంగాణ: శిక్షణా యుద్ధ విమానం కుప్పకూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలెట్లు మరణించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణంపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా పిలాటస్ పిసి 7 ఎంకె 11 విమానం హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) నుండి బయలుదేరినట్లు వైమానిక దళం తెలిపింది. విమానం కూలిపోయే సమయంలో ఓ ట్రైనర్, ట్రైనీ పైలెట్లు ఉన్నారని, ప్రమాదంలో వారిద్దరూ మరణించారని వైమానిక దళం (IFA) ‘ఎక్స్’ లో పేర్కొంది. ఒకే ఇంజన్ కలిగిన పిలాటస్ పిసి 7 ఎంకె 11 విమానాన్ని ఐఎఎఫ్ పైలెట్లు శిక్షణ పొందేందుకు వినియోగిస్తుంటారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!