బహ్రెయిన్ లో అరబ్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ
- December 04, 2023
బహ్రెయిన్: అరబ్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ (AICS) వరుసగా రెండవసారి బహ్రెయిన్ రాజ్యంలో జరుగనుంది. క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 6వతేదీలలో జరుగనుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సు అరబ్ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రాముఖ్యతపై చర్చిస్తారు. టెక్నాలజీపై పెరగడంతో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సైబర్ క్రైమ్స్ దృష్ట్యా, సైబర్ సెక్యూరిటీ రంగంలో సవాళ్లను పరిష్కరించడానికి మరియు వినూత్న పరిష్కారాలను అన్వేషించడం ఈ సదస్సు లక్ష్యం. అరబ్ ప్రాంతం అంతటా విజ్ఞాన మార్పిడి, సహకారాన్ని పెంపొందించడం, సైబర్ సెక్యూరిటీ అవగాహన కోసం ఈ సదస్సు వేదికగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు మరియు సైబర్ సెక్యూరిటీలో తాజా ఆవిష్కరణలు, పరిణామాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్‌తో కూడిన సమగ్ర ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
తాజా వార్తలు
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!









