ఒమన్ లో OMR4.6bn విలువైన ఆరు ప్రాజెక్టులు ప్రారంభం
- December 04, 2023
మస్కట్: ఒమన్ 53వ జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు జాతీయ వేడుకల కోసం సెక్రటేరియట్ జనరల్ షెడ్యూల్ సిద్ధం చేసింది. జాతీయ దినోత్సవ వేడుకల కార్యక్రమం సందర్భంగా ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (OIA) ఇటీవల ఆరు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ప్రకటించింది. దుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రాజెక్ట్, దుక్మ్ ఇంటిగ్రేటెడ్ పవర్ అండ్ వాటర్ స్టేషన్, రాస్ మర్కజ్ క్రూడ్ ఆయిల్ పార్క్, ఖువైమాహ్ ష్రిమ్ప్ ఫామ్, ఒక విద్యుత్ ప్రసార ప్రాజెక్ట్ మరియు JW మారియట్ హోటల్ మస్కట్. ఈ ప్రాజెక్టులు ఆర్థిక వైవిధ్యాన్ని పెంపొందించడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రారంభించబోయే ప్రాజెక్టుల మొత్తం వ్యయం OMR4.65 బిలియన్లు అని ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







