నాని వెర్సస్ నితిన్.! దారులు వేరే కానీ, గెలుపెవరిది.!
- December 05, 2023
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో ప్రధమంగా నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ ప్రత్యేకమైన సినిమాగా అభివర్ణించవచ్చు. ఈ సినిమాపై నాని చాలా చాలా నమ్మకంగా వున్నాడు.
పోస్టర్లు, ప్రచార చిత్రాలూ సినిమాపై చాలా అంచనాలు క్రియేట్ చేశాయ్. తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన రీసెంట్ మూవీ ‘యానిమల్’ ఫెయిలయ్యింది. ఇక, అదే సెంటిమెంట్‌తో రానున్న ‘హాయ్ నాన్న’పైనే ఇప్పుడు అందరి దృష్టి.
డిశంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే టైమ్‌లో ఒక్క రోజు గ్యాప్‌లో వస్తున్నాడు నితిన్ ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’గా. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆధ్యంతం వినోదాత్మకంగానే సాగింది.
ఇద్దరూ పోటా పోటీగా బాక్సాఫీస్‌ని షేక్ చేయాలని చూస్తున్నారు. ప్రమోషన్లు గట్టిగానే చేశారు. బజ్ కూడా బాగానే వుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎక్కువ పాజిటివిటీ సంపాదిస్తారో.! గెలుపెవరిదో అని తెలియాలంటే ఈ నెల 7, 8 తేదీల వరకూ ఆగాల్సిందే.
అన్నట్లు ‘హాయ్ నాన్న’లో మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ‘ఎక్స్‌ట్రా - ఆర్డీనరీ మేన్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!