లోటు తీర్చేస్తున్న బాద్‌షా.!

- December 05, 2023 , by Maagulf
లోటు తీర్చేస్తున్న బాద్‌షా.!

గత కొంత కాలంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, ఈ ఏడాది  రెండు పెద్ద సినిమాలతో వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద షేర్ అయిపోయారు. ‘పటాన్’, ‘జవాన్’ సినిమాలతో వరుస హిట్లు కొట్టి, షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్‌‌లో హుషారు నింపేశారు. ఇప్పుడు ఇంకో సినిమాతో వస్తున్నారు. అదే ‘డుంకీ’.

డిశంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్‌గా ‘డుంకీ - డ్రాప్ 4’ పేరుతో ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

హ్యాట్రిక్ ఖచ్చితంగా షారూఖ్ ఖాన్ సొంతమనిపిస్తోంది. తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

షారూఖ్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కాంబోలో వస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు బాగున్నాయ్. ఇదిలా వుంటే, ఒక మిషన్ నిమిత్తం ఓ వృద్ధుడు గతంలోకి వెళ్లి వచ్చే కథలా ఈ సినిమా కథ ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది.

ఆసక్తికరమైన కథా, కథనాలతో సాగే స్టోరీలా వుంది. రెండు రకాల గెటప్స్‌లో షారూఖ్ ఖాన్ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ‘జవాన్’లోనూ షారూఖ్ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇక, ‘డుంకీ డ్రాప్ 4’ ఎలా వుండబోతోందో తెలియాలంటే, డిశంబర్ 21 వరకూ ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com