ఎలాంటి సైడ్ ఎఫెక్టుల్లేకుండా నిద్రలేమికి చెక్ పెట్టేయండిలా.!
- December 05, 2023
కార్డిసాల్ అనే హార్మోన్ అధికంగా రిలీజ్ కావడం వల్ల ఒత్తిడి, అనవసరమైన ఆందోళన, కంగారు వంటి సమస్యలు ఏర్పడతాయ్. ఈ సమస్యలు నిద్రలేమికి కారణం.
తగినంత నిద్ర లేకుంటే, ఆరోగ్యంపై అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయ్. నిద్రలేమి సమస్యకు మార్కెట్లో అనేక మందులు అందుబాటులో వున్నాయ్.
అయితే, అన్ని రకాల మెడిసెన్స్ వాడడం వల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్టులు సంభవించొచ్చు. చాలా అరుదుగా ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు.
అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా నిద్రలేమి సమస్యను ఎదుర్కోవాలంటే ఆయుర్వేదంలో అశ్వగంధ పొడిని వినియోగించడం వుత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
అశ్వగంధను ఆయుర్వేదంలో ప్రముఖంగా వినియోగిస్తుంటారు. ఈ అశ్వగంధ పొడిని రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లల్లో కలిపి తీసుకోవడం వల్ల నిద్ర లేమి సమస్య తీరుతుంది.
అశ్వగంధలోని త్రి ఇధైల్ గ్లైకాల్ కార్డిసాల్ హార్మోన్ విడుదలను కంట్రోల్‌లో వుంచుతుంది. తద్వారా మెదడుకు పాజిటివ్ ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత.. అలాగే ప్రశాంతమైన నిద్ర సొంతమవుతాయ్.
అంతేకాదండోయ్. ఈ పొడిని వాడడం వల్ల మెదడు చురుగ్గా పని చేయడంతో, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం