రికార్డు స్థాయిలో ధరలు పెరిగినా బంగారం ఎందుకు కొంటున్నారు?
- December 05, 2023
యూఏఈ: రికార్డు స్థాయిలో ధరలు ఉన్నప్పటికీ యూఏఈ చుట్టూ ఉన్న బంగారు దుకాణాలు వ్యాపారంలో వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయడానికి ప్రజలు తరలిరావడంతో దేశవ్యాప్తంగా దుకాణాలు వద్ద భారీగా రద్దీ కనిపిస్తుంది. ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం ధరలు పెరుగుతాయనే అంచనా. నిష్కా జ్యువెలరీ చైర్మన్ నిషిన్ తస్లిమ్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అమ్మకాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశామన్నారు,. శుక్రవారం, బంగారం ఔన్స్‌కి $2,075ను తాకింది. మేలో దాదాపుగా $2,079-2,080 జోన్‌లో ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరేందుకు దగ్గరగా ఉంది. జైబా జ్యువెలర్స్ జనరల్ మేనేజర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. దుబాయ్‌లోని అన్ని ఔట్‌లెట్లలో కంపెనీ అమ్మకాలు పెరిగాయని చెప్పారు. బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నందున బంగారం కొనుగోళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కూడా అధిక విక్రయాలు జరుగుతున్నాయని సురేష్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!