‘ఖుషి’ మ్యూజిక్ డైరెక్టర్ మరో హిట్ కొడతాడా.?

- December 06, 2023 , by Maagulf
‘ఖుషి’ మ్యూజిక్ డైరెక్టర్ మరో హిట్ కొడతాడా.?

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమయ్యాడు. ‘ఖుషీ..’ అంటూ అందర్నీ ఆప్యాయంగా పలకరించేలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సినిమాకి.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమాకి పాటల నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, సినిమా రిలీజ్ అయ్యాకా స్టఫ్ సరిపోలేదంటూ యావరేజ్ ఖాతాలో పడేశారనుకోండి. పాటలయితే సూపర్ హిట్టు అందులో నో డౌట్.

ఇప్పుడు ఈ హేషమ్  ‘హాయ్ నాన్న’ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా పాటలు కూడా బాగానే వినిపిస్తున్నాయ్. సినిమాకి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది ఇప్పటికే. ఇక, మరికొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ కావల్సి వుంది.

ఈ నేపథ్యంలో హేషమ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆయన మ్యూజిక్ అందించిన ‘హాయ్ నాన్న’ సినిమా హిట్ అయితే, ఇక చూసుకోనక్కర్లేదు తెలుగులో మరిన్ని అవకాశాలు ఆయన సొంతం అంతే.!

ఇక, ‘హాయ్ నాన్న’ విషయానికి వస్తే, నాని, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమా తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతోంది. పాజిటివ్ బజ్ అందుకుంటోంది. నానికి మరో ‘దసరా’ పండగ తెస్తుందో లేదో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com