విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్
- December 07, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం చాలా సీరియస్ గా సాగింది. విద్యుత్ శాఖపై రివ్యూ సీరియస్ గా సాగింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
రేపటిలోగా(డిసెంబర్ 8) పూర్తి వివరాలతో రావాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రేపు(డిసెంబర్ 8) ఉదయం విద్యుత్ పై సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు చెప్పారు అధికారులు. మరోవైపు ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్