3Dలో దుబాయ్ స్టోరీ..500 డ్రోన్‌లతో అద్భుతమైన ప్రదర్శన
- December 08, 2023
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) డ్రోన్స్ షో సందర్శకులను ఆకట్టుకుంటుంది. 500 డ్రోన్‌లతో 3Dలో దుబాయ్ స్టోరీని తెలిపే అద్భుతమైన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లోని బ్లూవాటర్స్ ద్వీపంలో డ్రోన్ల టేకాఫ్, ల్యాండింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ అయిన ఐన్ దుబాయ్ ముందు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు రాత్రి 7-10 గంటల మధ్య ప్రదర్శనలు ఉంటాయని ఈవెంట్స్ ప్లానింగ్, దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) ఎగ్జిక్యూటివ్ కల్తామ్ అల్షంసి తెలిపారు. జనవరి 29 వరకు ఈ ప్రాంతంలో డ్రోన్ ప్రదర్శనను నిర్వహిస్తారని పేర్కొన్నారు. అధిక వేగంతో కూడిన గాలులు, వర్షం ఉన్నప్పుడు డ్రోన్ ప్రదర్శనలు ఉండవని గమనించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష