100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్‌ల జరిమానా
- December 10, 2023
యూఏఈ: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు దుబాయ్‌లో డజన్ల కొద్దీ డ్రైవర్లకు జరిమానాలు, వారి వాహనాలను జప్తు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 4,420 ప్రమాదకరమైన ఉల్లంఘనలు నమోదయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రోడ్డు విన్యాసాలు చేయడం నుండి అనధికార కవాతులు, పోలీసు సూచనలను ధిక్కరించడం వంటి ఉల్లంఘనలు నమోదు అయ్యాయి. మొత్తం 94 కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అధికార యంత్రాంగం ఇప్పుడు కొన్ని నేరస్తుల ఉల్లంఘనలను చూపించే వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. "వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన డిక్రీ 30 ప్రకారం నేరస్తులు కఠినమైన జరిమానాలను ఎదుర్కొంటారు. వాహన విడుదల కోసం జరిమానాలు Dh50,000 వరకు ఉంటాయి." అని దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి తెలిపారు. అల్ రువయ్యా, జుమైరా మరియు ఇతర నివాస ప్రాంతాలలో చాలా ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







