తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు..

- December 12, 2023 , by Maagulf
తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు..

హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పలు విభాగాల్లో అధికారుల బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త సీపీలు వీరే..
హైదరాబాద్ సీపీ : కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ సీపీ : అవినాశ్ మహంతి
రాచకొండ సీపీ : సుధీర్ బాబు
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ : సందీప్ శాండిల్యా
ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీగా ఉన్న దేవేంద్ర చౌహాన్ లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com