‘సలార్’ సౌండే లేదే.!

- December 13, 2023 , by Maagulf
‘సలార్’ సౌండే లేదే.!

ప్రబాస్ సినిమా అంటేనే అదో కిక్కు జనానికి. ఎంతైనా యూనివర్సల్ హీరో కదా. కానీ, ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నటించిన ఏ సినిమాకీ అంత సీనూ సినిమా లేకుండా పోతోంది.

రిలీజ్‌కి ముందు హైప్ తప్ప, రిలీజ్ తర్వాత సినిమాలన్నీ తుస్సుమంటున్న సందర్భాలే. ఇక, తాజా మూవీ ‘సలార్’ విషయానికి వస్తే.. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.

‘కేజీఎఫ్’తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్. హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాణం.. అన్నీ బాగానే వున్నాయ్. కానీ, సినిమాకే హైప్ రావడం లేదు. హైప్ వచ్చేలా చిత్ర యూనిట్ కూడా ప్రవర్తించడం లేదు.

ఎప్పుడో సెప్టెంబర్‌లో రావల్సిన సినిమా. పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇయర్ ఎండింగ్ డిశంబర్ 22కు డేట్ ఫిక్స్ చేసుకుంది. మరి కొద్ది రోజులు మాత్రమే అందుకు మిగిలుంది.

కానీ, ఎక్కడా ‘సలార్’ సందడే కనిపించడం లేదు. అటు ప్రబాస్ ఫ్యాన్స్ కానీ, ఇటు సినిమా టీమ్ కానీ, ప్రబాస్ కూడా ఏమాత్రం కిక్కురుమనడం లేదు. మొన్నీ మధ్యనే ట్రైలర్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారంతే.

ప్రబాస్ సినిమాకి ఇలా చేస్తే పెట్టిన ఖర్చు భారీ.. తీరు చూస్తే ఇది. మరి, కనీసం ఓపెనింగ్స్ అయినా రాబట్టాలిగా.! మరీ ఇంత సైలెంట్‌గా వుంటే ఎలా స్టార్ హీరో సినిమాకి.. ఇదీ నెటిజన్ల అభిప్రాయం. అంతేగా.!  చిన్న సినిమాలకే ప్రమోషన్లు ఊదరగొట్టి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న రోజులివి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com