చిలగడ దుంపలు తింటున్నారా.?

- December 13, 2023 , by Maagulf
చిలగడ దుంపలు తింటున్నారా.?

చలి వాతావరణంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతుంటారం. వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కానీ, తట్టుకోగలిగేలా ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలు తీసుకోవడం వుత్తమం.

ఈ కాలంలో మాత్రమే ముఖ్యంగా లభించే కొన్ని కూరగాయలు, పండ్లను తప్పక తీసుకోవాలి. అలాంటి వాటిలో ఒకటి చిలగడ దుంప. స్వీట్ పొటాటోగా పిలిచే ఈ దుంపను ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఈ కాలంలో తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటూ, చిలగడ దుంపలోని కాల్షియం, పొటాషియం, ఐరన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయ్.

ముఖ్యంగా చిలగడ దుంపలోని బీటా కెరోటిన్ కంటి చూపుకు చాలా మంచిది. కంటి చూపును మెరుగ్గా చేయడంలో చిలగడ దుంపలోని ప్రొటీన్లు చాలా సహాయ పడతాయ్. అలాగే, రక్తపోటును నియంత్రించడంలోనూ చిలగడ దుంపలు కీలక పాత్ర పోషిస్తాయ్. తద్వారా గుండె పోటు సమస్య రాకుండా వుంటుంది.

శీతాకాలంలో చర్మం పొడిబారడం వంటి సమస్యల్ని సైతం చిలగడ దుంప నియంత్రిస్తుంది. ఉపవాసం చేసే వారికి తక్షణ శక్తినివ్వడంలో చిలగడ దుంప చాలా ఉపకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com