18న హైదరాబాద్కు రాష్ట్రపతి.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్
- December 13, 2023
హైదరాబాద్: శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఆమె తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోని, తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ రవి గుప్తా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, హెల్త్ సెక్రటరీ రిజ్వి, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!