వైజాగ్ ఇండస్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
- December 14, 2023
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆసుపత్రి రెండో అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ మార్గం గుండా పలువురు రోగులను బయటకు తీసుకొచ్చారు.
వారిని సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి భారీగా వెలువడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని షాపులను అధికారులు మూసేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!