కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రష్యా ప్రభుత్వ ఆహ్వానం..

- December 15, 2023 , by Maagulf
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రష్యా ప్రభుత్వ ఆహ్వానం..

న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రష్యా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించింది. రష్యాలే వచ్చే ఏడాది జరగనున్న ‘4వ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం’ సదస్సుకు హాజరు కావాలంటూ కిషన్‌ రెడ్డిని ఆహ్వానించారు. ఇందులో భాగంగా రష్యా ప్రభుత్వం భారత సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖరాశారు.

రష్యా రాజధాని మాస్కోలో.. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఈ సదస్సుకు రావాలంటూ.. ఆ దేశ ఆర్థిక శాఖ సహాయ మంత్రి దిమిత్రి వఖ్రుకోవ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. భారత్-రష్యా మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, పర్యాటక బంధాన్ని వఖ్రుకోవ్ గుర్తుచేస్తూ.. పర్యాటక, వ్యాపార రంగాల్లో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఇదొక మంచి వేదిక అని అందుకే ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ వేదిక ద్వారా భారతదేశ పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యాన్ని, సంప్రదాయాలను. రష్యా పర్యాటకులకు తెలియజేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పొత్తులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తులు ఉండవని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమేనని కిషన్‌ రెడ్డి కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్‌ రెడ్డి తేల్చి చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో సమానం పోరాటాలుంటాయని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు. సర్వే సంస్థలకు కూడా అందని విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com