విద్యార్ధి భవిష్యత్ అవకాశాలు–గ్రోత్ కోసం ఆవిష్కరించిన ఒక అరుదైన వేదిక
- December 16, 2023
హైదరాబాద్: స్టుడెంట్ ట్రైబ్ యాప్ ఒక నయా సంచలనం. విద్యార్ధుల భవితకు..వారి పురోగతికి కావాల్సిన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఒక సమ్మిళిత వ్యవస్థ. ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాల ఫీచర్. పోటీ ప్రపంచంలో విద్యార్ధులకు మార్గనిర్దేశం చేసే ఒక వేదిక. ఇప్పటికే ప్రముఖ వ్యక్తులు..విద్యా వేత్తలు..ఐటీ నిపుణులను ఆకట్టుకుంది. 2023 డిసెంబర్ 14న ఈ యాప్ ఆవిష్కరణ జరిగింది. పలువరు ప్రముఖులు ఈ యాప్ లక్ష్యాలను…ఉద్దేశాలను ప్రశంసించారు.
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్ధులకు ఇంటర్న్ షిప్..ఉద్యోగ అన్వేషణలో వారికి మార్గదర్శకంగా నిలవనుంది. సమయానుకూలంగా వారికి దిశా నిర్దేశం చేస్తూ పూర్తిగా వారికి సహాయకారిగా నిలుస్తుంది. ఈ యాప్ లో చేసిన అధునాతన టెక్నాలజీ ఉద్యోగాన్వేషణలో విద్యార్ధులకు తోడ్పాటు అందిస్తుంది. స్టూడెంట్ ట్రైబ్ యాప్ అనేది విద్యార్థి లక్ష్య సాధనలో వారధిగా నిలుస్తుంది.
ఈ యాప్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. అనేక మెళకువలకు వేదికగా నిలుస్తుంది.
ఈవెంట్స్: విద్యార్ధులకు ఈవెంట్స్ నిర్వహణ సులభతరంగా పూర్తిచేసేలా ఈ యాప్ సహాయకారిగా ఉంటుంది.
ఆర్టికల్స్: విద్యార్దులకు కావాల్సిన స్థాయిలో ప్రోత్సాం అందిస్తూ వారే ఆర్టికల్స్ రాసే స్థాయికి తీసుకురానుంది. St కాయిన్స్ సంపాదించేలా ఎంకరేజ్ ఉంటుంది.
సంయుక్త నిర్వహణ: విద్యార్ధులకు అవసరమైన అంశాల పైన గ్రూపు చర్చలకు ప్రోత్సాహం ఇస్తుంది
స్టూడెంట్ ట్రైబ్ కాయిన్స్: యాప్ కరెన్సీలో నోవల్ గా నిలుస్తుంది ఈ కాయిన్స్. యాప్ లో విభిన్న మార్గాల నిర్వహణ ద్వారా కాయిన్స్ దక్కించుకొనే అవకాశం ఉంటుంది. యాప్ ద్వారా కొనుగోళ్లలో ఈ కాయిన్స్ రిడీమ్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
ఇన్ఫినిటమ్‌తో కలిసి ఈవెంట్ నిర్వహించారు. ఇన్ఫినిటమ్ సీఈఓ రాఘవేంద్ర వంటి పరిశ్రమ ప్రముఖులు తో పాటుగా విరాజిత శర్మ, రవిశివ తేజ వంటి ప్రముఖుల మెంటార్ షిప్ కొనసాగించాలని కోరారు. వీరి స్పూర్తితో విద్యార్ధుల నుంచి కొత్త సృష్టికర్తలను ఆవిష్కరించే ప్రయత్నం జరగనుంది. క్రియేటర్స్ ను సృష్టించటం..అభివృద్ధి చెందడానికి ఆచరణాత్మక అవకాశాలను అందించాలనేది తమ లక్ష్యంగా స్పష్టం చేసింది. ఈ ఆవిష్కరణ కేవలం ఒక యాప్ మాత్రమే కాదని..ఒక కమ్యూనిటీగా చూడాల్సి ఉందని స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపక సీఈఓ శ్రీ చరణ్ లక్కరాజు తన విజన్‌ని పంచుకున్నారు.
2015లో ప్రారంభమైనప్పటి నుండి, స్టూడెంట్ ట్రైబ్ ఇన్నోవేషన్.. సాధికారతకు నాంది పలికింది. స్టూడెంట్ ట్రైబ్ యాప్ ఏషియా 30 ఫోర్బ్స్ 30 లో గుర్తింపు దక్కించుకుంది.శక్తివంతమైన విద్యార్థులకు మార్గదర్శిగా నిలవటం ఈ యాప్ లక్ష్యంగా వివరించారు. వైబ్రంట్ స్టూడెంట్స్ కమ్మూనిటీకి లక్ష్య సాధనలో ముందుకు తీసుకెళ్లటమే ఈ యాప్ లక్ష్యం.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!