ప్రముఖ ఒబెస్ట్ట్రీషన్ & గైనకాలజిస్ట్ డా.కావ్యప్రియ వజ్రాలతో ముఖాముఖి...
- December 16, 2023ప్ర): యుక్త వయసు ఆడ పిల్లల్లో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎలా వుంటాయి.?
జ): యుక్తవయసులో మొదటి రెండు సంవత్సరాల పాటు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ లో హైపర్ థైరమిన్, పిట్యుటరి, థైరాయిడ్, అండ్రినలిన్, యూట్రన్ యాక్సెస్ ఎస్టాబ్లిష్ మెంట్ సీక్వెన్స్ కావడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో అధిక బ్లీడింగ్ అవుతుంది. కానీ ఇది సహజం.దీంతో రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బాధితుల్లో హిమోగ్లోబిన్ శాతం భారీగా తగ్గిపోయిన(పిబర్టిమానిటియా) సందర్భంలో మాత్రం గైనకాలజిస్టును సంప్రదించాలి. ఇంకొందరికి 14-15 ఇయర్స్ వరకు పీరియడ్స్ రాదు. దీనిని మెనార్క్ అంటారు. అప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి. ప్రికాషిన్ పీబర్టి కండిషన్ అంటే రొమ్ములు, రోమాలు లాంటి సెకండరీ సెక్సువల్ స్టేజ్ డెవలప్ మెంట్స్ తొందరగా అవుతుంది. దీనికి ఇస్టోజన్ హార్మోన్ ఇంజెక్షన్ కారణంగా కలుషితం అయిన పాలు తాగడం కారణంగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్సు వారిలో ప్రికాషన్ పీబర్టి, పిబర్టి మెనరిజియా, ప్రైమరీ ఎమనోరియా సమస్యలు కనిపిస్తాయి. అసహజ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.
ప్ర): రుతుస్రావం సంబంధిత అనారోగ్య సమస్యల పట్ల ఆడ పిల్లలకు మీరెలాంటి సూచనలు చేస్తుంటారు.?
జ): రుతుస్రావ సమస్యలను తెలుసుకునే ముందు సాధారణంగా రుతుస్రావం అంటే ఎందో అవగాహన ఉండాలి. సాధారణంగా 28 రోజుల్లో పీరియడ్ రావాలి. కొందరిలో 28-30 రోజులలో వస్తుంది. ఇది కూడా సాధారణంగానే పరిగణిస్తారు. 25 డేస్ కంటే తక్కువ, 35 డేస్ కంటే ఎక్కువ అయితే అది సమస్యగా చూడాలి. బ్లిడింగ్ ఎక్కువయినా అది సమస్యగానే చూడాలి. రోజుకు 3 ప్యాడ్లు మార్చితే అది సాధారణంగా చూడాలి. అదే ఎక్కువైతే మాత్రం సమస్య ఉన్నట్లే. రోజుకు ఒక ప్యాడ్ మాత్రమే మార్చితే దానిని హైపర్ మెనరేజియా అంటారు. అదే 3 కంటే ఎక్కువైతే దాన్ని మెనరేజియా అంటారు. ఫస్డ్ డే పీరియడ్ లో నొప్పి అనేది సహజం. మెన్సువల్ సైకిల్ మొత్తం నొప్పి వస్తుందంటే అది సమస్యగా భావించి డాక్టర్ ని సంప్రదించాలి. దీంతోపాటు ప్రిమెన్సువల్ సిండ్రోమ్ ఉంటుంది. ఇందులో భాగంగా రొమ్ములో నొప్పి, కోపం చిరాకు, మోషన్స్, వాంతులు లాంటి సమస్యలు ఉంటే గైనకాలజిస్టును సంప్రదించాలి.
ప్ర): తల్లికి సైతం తమ అనారోగ్య సమస్య గురించి చెప్పుకోలేని ఆడ పిల్లలకు మీరిచ్చే సందేశం ఏంటి.?
జ): తల్లికి ప్రతిదీ చెప్పాలి. తల్లి అనుభవం ఇక్కడ పక్కన పెట్టే ప్రసక్తి ఉండదు. ఒకవేళ తల్లితో సాన్నిహిత్యం లేని సందర్భాల్లో గైనకాలజిస్టును సంప్రదించి సమస్యలను చెప్పుకోవాలి.ఒక మహిళ సమస్యలను మరో మహిళ మాత్రమే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా పీరియడ్ లాంటి విషయాల్లో ఇది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒకరు తల్లి, లేదా ఇతర మహిళలతో తమ సమస్యలపై చర్చించాలి.దీంతో ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ప్ర): పీసీవోడీ అనేది ఇటీవలి కాలంలో తరచూ చూస్తున్న సమస్య. ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి చెప్పండి.!
జ): పీసీవోడీ అనేది ఇటీవలి కాలంలో చాలా సాధారణం(పాండమిక్) అయింది. ప్రతి 5 మందిలో ఒకరిలో ఈ సమస్య కనిపిస్తుంది. లైఫ్ స్టయిల్ సమస్య ఇది. మెటబాలిజమ్ లో ఉన్న సమస్య కారణంగానే పీసీవోడీ వస్తుంది. పీసీవోడీ అనే ఒవెరియన్ డిసిజ్ కాదు. బీఎంఐ 18-24 మధ్య ఉండేలా చూసుకోవాలి. రాత్రి 10 గంటలకల్లా నిద్రపోవాలి. ఎందుకంటే రాత్రి సమయంలో స్టిరాయిడ్ సక్రిషన్ అవుతుంది. సాయంత్రం 6.30 తర్వాత ఏమీ తినవద్దు. ఒత్తిడి(స్ట్రెస్)కి దూరంగా ఉండాలి. రోజులో ఒక గంట ఎక్సర్ సైజులు చేయాలి. స్ట్రెస్ ను దూరం చేసుకునేందుకు ఆన్ లైన్ వేదికగా ఎన్నో థెరపిలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్ని చేయడం ద్వారా పీసీవోడీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ప్ర): అధిక రుతుస్రావంకి కారణాలేంటి.? నివారణ చర్యలేంటి.?
జ): థైరాయిడ్ సమస్యల కారణంగా అధిక రుతుస్రావం సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో థైరాయిడ్ తక్కువున్న సమస్య కనిపిస్తుంది. టీబీ యూట్రస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే గర్భసంచిలో పాలిప్స్, పైబ్రాయిడ్ గడ్డలు, క్యాన్సర్లు ఉన్న సమయంలో ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే గుండెజబ్బులు సమయంలో వాడే మందుల మోతాడు ఎక్కువైన సందర్భాల్లో కూడా అధిక రుతుస్రావం జరుగుతుంది. అడియోమైనసస్, ఎండో మెట్రియోసిస్ ఇవన్ని ఆర్గానిక్ కారణాల వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే, అసలు సమస్యల ఏది అనేది డయాగ్నసిస్ చేయడం ద్వారా నిర్ధారించి సరైన మందులను వాడితే సమస్యను పరిష్కరించుకోవచ్చు. వాటిని అలా వదిలేస్తే మాత్రం సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉంటుంది.
ప్ర): రుతుక్రమం సరిగ్గా లేకపోవడాన్ని తీవ్ర అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చా.?
జ): రుతుక్రమం సరిగ్గా లేని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉంది అనే దానిని రుతుస్రావం, మోషన్, యూరిన్, స్కిన్, వెంట్రుకలను బట్టి చెప్పవచ్చు. వీటిల్లో తేడా ఉన్నదంటే సమస్య ఉన్నదని గుర్తించాలి. మెటబాలిజమ్, డయాబెటిస్ ఉన్నా, లేదా ఎనీమియా, థైరాయిడ్ సమస్యలు ఉన్నా, ఇంకా రక్త సంబంధిత సమస్యలు లాంటివి రుతుస్రావంపైన ప్రభావం చూపుతాయి. సమస్య ఏంటన్నది తెలుసుకునేందుకు ప్రతి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలి.
ప్ర): బిడ్డ జననం తర్వాత తల్లికి సహజంగా కలిగే అనారోగ్య సమస్యలు ఏమేం వుంటాయి.?
జ): బిడ్డ జననం తర్వాత తల్లికి సహజంగా కొన్ని సమస్యలు ఉంటాయి. నిద్రలేమి, డిప్రెషన్, హెల్ప్ లెస్ నెస్ లాంటి మానసిక సమస్యలు కనిపిస్తాయి. అలాగే బ్రెస్ట్ ఎంగాజ్ మెంట్ వస్తుంది. బేబికి పాలు ఇవ్వడంలో టెక్నిక్ తెలియని కారణంగా నిప్పల్ వద్ద దద్దుర్లు, ఇన్ఫెక్షన్, నొప్పి, రక్తస్రావం లాంటి సమస్యలు కనిపిస్తాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు ఏడాది వరకు రుతుస్రావం కాదు. కానీ ఆ సమయంలో ఎగ్ విడుదల అవుతుంది. దీంతో కొన్ని సందర్భాల్లో మళ్లీ గర్భం ధరించవచ్చు. కాబట్టి అనుమానం రాగానే ప్రెగ్నేన్సీ చెక్ చేసుకోవడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఓవర్ బ్లిడింగ్ కూడా కావచ్చు. ముత్రం తెలియకుండానే పోవడం లాంటివి కూడా గమనించవచ్చు. పాలు ఇచ్చే తల్లులు కాల్షియం, ఐరన్ ట్యాబెట్లు వేసుకోవడం మర్చిపోతారు. ఈ కారణంగా కాల్షియం లోపాలు తలెత్తి బోన్స్ అరుగుదల కనిపిస్తుంది. అలాగే నొప్పులు కూడా ఉంటాయి. కాబట్టి బిడ్డను కన్న తల్లులు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలి. అదే సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు అనేది చాలా ముఖ్యమైన విషయం.
ప్ర): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పట్ల ఎలాంటి అవగాహనతో వుండాలి.?
జ): ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల అనేక మంది చనిపోతున్నారు. స్క్రీనింగ్ ద్వారానే దీనిని ముందుగా గుర్తించవచ్చు. స్క్రీనింగ్ అండ్ ప్రొఫైల్ యాక్సెస్ అనే పరంగా విభజించుకొని చూడాల్సి ఉంటుంది. స్కీనింగ్ అనేది 21 సంవత్సరాల తర్వాత సెక్సువల్ గా యాక్టివ్ గా ఉంటే.. పాప్ స్మియర్ అనే టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. మొదటగా మూడు సంవత్సరాలు వరుసగా ఈ టెస్టులు చేయించుకోవాలి. టెస్టుల్లో నెగటివ్ వస్తే.. 35 ఏళ్ల వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ఆ తర్వాత 60 ఏళ్ల వరకు ప్రతి 5 ఏళ్లకు ఓసారి చేయించుకోవాలి. ఇక ఆ తర్వాత పాప్ స్మియర్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఇంతకుముందు ఎప్పుడు చేయించుకోకపోతే మాత్రం.. తెలియగానే చేయించుకోవాలి. ప్రొఫైల్ యాక్సెస్ పరంగా చూస్తే.. నోనా వాలెంట్ వ్యాక్సిన్ అనేది ఇటీవల అందుబాటులో ఉన్నది. దీనితో హెచ్.పి.వీ అనే వైరస్ క్యాన్సర్ తొమ్మిది స్ట్రేంజీలను సమర్థంగా అడ్డుకోవచ్చు. 11-14 వయస్సులో గర్ల్స్, బాయ్స్ లు ఈ వ్యాక్సిన్ ను వేయించుకోవచ్చు. ఇందులో జీరో డోస్, 6 నెలల డోస్ ఉంటుంది. 14 సంవత్సాల తర్వాత ఇది మూడు డోసులు అవుతుంది. జీరో, 2 నెలలు, 6 నెలల డోస్ అవుతుంది. వీటిని కూడా బాలబాలికలు వేయించుకోవచ్చు. ఆ తర్వాత 45 ఏళ్ల తర్వాత మళ్లీ వేయించుకోవాల్సి ఉంటుంది.
ప్ర): నాలుగు పదుల వయసులో తల్లవ్వాలనుకునేవారికి మీరిచ్చే సలహా.?
జ): 40 ఏళ్ల తర్వాత తల్లి అయ్యేవారికి కొన్ని సమస్యలు ఉంటాయి. తల్లవ్వడానికి అది చాలా లేట్ వయసు. సాధారణంగా 22-25 ఏళ్ల వారిలో అండం(ఎగ్) నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా వాటి సంఖ్య బాగా ఉంటుంది. దీనిని ‘ఏమేజ్’ అంటారు. ఇది బాగాతగ్గిపోయతే తల్లి అయ్యే చాన్స్ తగ్గుతుంది. సాధారణంగా 25 ఏండ్లు దాటిన తర్వాత ప్రతి కణం ఏజింగ్ కు గురవుతాయి. అండాలు సైతం ఏజింగ్ కు గురవుతాయి. ఇక నాలుగు పదులు దాటిన వారిలో ఎగ్స్ సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. అలా కాకుండా 40 ఏళ్లు దాటిన తర్వాత పుట్టబోయే బేబీస్ కూడా జెనెటిక్స్ సమస్యలతో పుట్టే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మానసిక, శారీరక సమస్యలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. డిఫికల్టీ డెలివరీ, కాంప్లికేటేడ్ డెలివరీ, ప్రీ టైమ్ డెలివరీ, బీపీ, థైరాయిడ్, డయాబెటిక్ లాంటి లైఫ్ స్టయిల్ సమస్యలు ఇబ్బందిగా మారుతాయి. ఒకవేళ 25 ఏళ్ల వయస్సులో ముందుగానే ప్లాన్ వేసుకుంటే.. ఎగ్ ప్రీజింగ్ కు ప్రయత్నించాలి. నాలుగు పదుల వయసులో ప్రెగ్నేన్సీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.
ప్ర): ఏ వయసులో పిల్లల్ని కనడం వల్ల భవిష్యత్ అనారోగ్య సమస్యలు తక్కువగా వుంటాయి.?
జ): పిల్లలను కనడానికి 25-27 కరెక్ట్ వయసు. 30 ఏళ్లలోపు ఇద్దరిని కనేస్తే.. ఆ తర్వాత తమతమ కెరీర్ పై ఫోకస్ పెట్టవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది కెరీర్ కంపారిజన్ లో వెనుకబడిపోతామని భావిస్తూ.. పిల్లలను కనడంలో వెనుకబడిపోతున్నారు. అదే పిల్లలను ముందుగానే కనేసి, ఆతర్వాత కెరీర్ పై ఫోకస్ పెడితే.. హెల్డీ కిడ్స్ ఉండటం, కెరీర్ బాగుండటం రెండు జరుగుతాయి. అదే లేటు వయసులో పిల్లలను కనడం ద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకని ఎర్లీ ఏజ్ లో పిల్లలను కనడం అన్ని విధాలా మేలు.
ప్ర): రొమ్ము క్యాన్సర్‌ని ముందుగా గుర్తించడం గురించి మహిళలకు మీరిచ్చే సూచన.?
జ): సాధారణంగా మహిళల్లో 30-32 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ముందుగానే గుర్తించేందుకు ప్రతిరోజు స్నానం చేసే సమయంలో చెక్ చేసుకోవాలి. రొమ్మును నాలు భాగాలుగా విభజించి అరచేతితో తడిమి చూసుకోవాలి. ఏవైనా గడ్డలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అలాగే స్కీన్ మీద మార్పులు, చనుమోలు నుంచి స్రావాలు వస్తున్నాయా, చంకలో బిల్లలు ఏమైనా కట్టినట్లు గుర్తిస్తే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి తగిన టెస్టులు(సోనో మమ్మోగ్రఫి, మమ్మోగ్రఫీ) చేయించుకోవాలి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారు మమ్మోగ్రఫీ చేయించుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీలో స్ట్రాంగ్ హిస్టరీ ఉందంటే బ్రాకాఫ్యానల్, జీన్ ఫ్యానల్ చేయించుకొని మీకు ఎంత ప్రాబబులిటీ ఉందో చెక్ చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ను ఆదిలోనే గుర్తించవచ్చు.
ప్ర): బిడ్డకు చనుబాలు ఇవ్వడం ద్వారా అందం దెబ్బ తింటుందనే మూఢ నమ్మకం ఇంకా ఎందుకు తల్లుల్లో కనిపిస్తోంది.?
జ): బిడ్డకు చనుబాలు ఇవ్వడం ద్వారా రొమ్ములు సాగుతాయి. అయితే, అందమనేది శాశ్వతం కాదు. దాని కోసం బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టవద్దు. మొదటగా వచ్చే పాలు(కొలస్టమ్) బేబీకి వ్యాక్సిన్ లాంటిది. వాటిని తప్పకుండా పుట్టిన బిడ్డకు ఇవ్వాలి. రెగ్యులర్ గా పీడింగ్ ఇవ్వడం ద్వారా తల్లికి, బేబీకి మధ్య బంధం పెరుగుతుంది. దీంతో బిడ్డ జ్యా, బ్రెయన్ డెవలప్ మెంట్ బాగుంటుంది. అదే సమయంలో పాలిచ్చే తల్లులు క్యాన్సర్ రాకుండా కూడా రక్షింపబడతారు. ఇన్ని బెనిఫిట్స్ చూసుకున్నప్పుడు అందం అనేది వీటి ముందు చిన్న విషయం. ఈరోజుల్లో అందమనేది చూసుకున్నా.. దాని కోసం బ్రెస్ట్ ఆర్గమెంటింగ్ సర్జరీ అనేది ఉన్నది. సస్పెండింగ్ బ్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్రెస్ట్ పీడింగ్ దూరమైన బేబీ మానసిక ఎదుగుదల లోపించినా, పాలు ఇవ్వని తల్లి రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ వాటినుంచి బయటపడటం అనేది కష్టం. లాభనష్టాలను బాగా ఆలోచించి అందం అనే ఆలోచనలను పక్కనబెట్టి బేబీ ఆరోగ్యంపై దృష్టి పెట్టి పాలు పట్టాలి.
ప్ర): మహిళల్లో పెరుగుతున్న థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం గురించి చెప్పండి.!
జ): ఈ రోజుల్లో మహిళల్లో థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం అనేవి పెరుగుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు స్క్రీనింగ్ బాగా చేస్తున్నందునా.. ఎమైనా ఉన్నా తొందరగానే బయటపడుతున్నాయి. కానీ ఒకప్పటి లైఫ్ స్టయిల్ ఇప్పుడు లేదు. గతంలో ఉన్నమాదిరిగా ఫిజికల్ వర్క్ లేదు. అంతా స్మార్ట్ లైఫ్ అయిపోయింది.కూర్చున్న దగ్గరికే అన్ని రావడం అనేది జరుగుతుంది. పిజికల్ యాక్టివిటిస్ తగ్గిపోవడం వలన మెటబాలిజమ్ సమస్యలు వస్తున్నాయి. దీంతో థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం ఒకదాని తర్వాత వస్తున్నాయి. వీటిల్లో ఏదైనా ఒకటి వస్తే.. మిగతావి ఆటోమెటిక్ గా వస్తాయి. ఇవి కవలలు లాంటివి. ఫిట్ నెస్, మంచి నిద్ర, పౌష్టికాహారం అనేది చాలా ముఖ్యం.
ప్ర): సుఖవ్యాధుల విషయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
జ): ఈరోజుల్లో క్యాజువల్ రిలేషన్ షిప్స్ ఎక్కువయ్యాయి. అదే సమయంలో సెక్సువల్లీ ట్రాన్స్ మీటెడ్ డీసీజెస్ కూడా ఎక్కువై పోయాయి. హెచ్ఐవీ ఉన్నా దాచిపెట్టి పెళ్లీలు చేసుకుంటున్న మోసాలు కూడా జరగడం చూస్తున్నాం. ఏమైనా మ్యారేజ్ కంటే ముందు ప్రీ మారిటల్ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్ లోనే సుఖవ్యాధుల స్క్రీనింగ్ కూడా ఉంటుంది. ఇదయ్యాకే పెళ్లి అనేది చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది కాకుండా డేటింగ్ యాప్స్ ద్వారా క్యాజువల్ రిలేషన్ షిప్, మల్టీపుల్ సెక్సువల్ పార్టనర్స్ ఉన్నా సెక్సువల్ ఫ్యానల్ టెస్టులు(హెచ్ఐవీ, హెచ్ పీఐసీజీ, హెచ్వీసీ, హెచ్ఎస్వీ అండ్ వీడీఆర్ఎల్ ) చేయించుకోని, పార్టనర్ ని ఎంపిక చేసుకోవాలి. ఎమోషనల్ ఎంత ముఖ్యమో.. ఆరోగ్యం కూడా అంతే ప్రాధాన్యం. ఒక తప్పు వల్ల జీవితం నాశనం చేసుకోవద్దు. పెద్దలు చెప్పిన విలువలకు కట్టుబడి ఉండాలి. నమ్మకమైన ఒక పార్టనర్ ని మాత్రమే కలిగి ఉంటే ఇలాంటి సుఖ వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
--Dr.Kavya Priya Vazrala(Consultant Obstetrician & Gynaecologist KIMS Hospitals,Hyderabad)
తాజా వార్తలు
- BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం