62వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ తెలుగు విజేతల జాబితా ప్రకటించారు
- June 28, 2015
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ప్రతి ఏటా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషలగాను ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతూనే ఉంది. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా , సౌత్ కు సంబదించిన అవార్డ్స్ నిన్న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సౌత్ స్టార్స్ మద్య చాల గ్రాండ్ గా ఈ వేడుక జరిగింది . ఇక తెలుగు సినిమాల విజేతల లిస్ట్ ఓ సారి గమనిస్తే.అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి నటించిన 'మనం' చిత్రం మొత్తం 5 క్యాటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకొని నెంబర్ వన్ గా నిలిచింది. ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా 5 అవార్డులతో మనం చిత్రం సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి దక్కింది..ఇక పూర్తి విజేతల లిస్ట్ తెలుసుకోవాలంటే ఈ లిస్ట్ చుస్తే మీకే తెలుస్తుంది. ఉత్తమ చిత్రం : మనం ఉత్తమ దర్శకుడు : విక్రమ్ కుమార్ (మనం) ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (రేసు గుర్రం) ఉత్తమ నటి : శృతి హాసన్ (రేసు గుర్రం) ఉత్తమ సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్ (మనం) ఉత్తమ సహాయ నటుడు : జగపతి బాబు (లెజెండ్) ఉత్తమ ఛాయాగ్రహకుడు : పీ.ఎస్. వినోద్ (మనం) ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి (చందమామ కథలు) ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్ ('కనిపెంచిన'.. మనం) ఉత్తమ నేపథ్య గానం (మేల్) : సింహ ( సినిమా సూపిత్త మామ.. రేసు గుర్రం) ఉత్తమ నేపథ్య గానం (ఫీమేల్) : సునీత (ఏం సందేహం లేదు.. ఊహలు గుసగుసలాడే)
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









