రస్ అల్ ఖైమాలో 6.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు

- December 17, 2023 , by Maagulf
రస్ అల్ ఖైమాలో 6.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు

యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. గతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 8.8ºC  ఉండగా.. కొత్తగా 6.6ºC ఉష్ణోగ్రతను నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. శనివారం తెల్లవారుజామున రస్ అల్ ఖైమాలోని పర్వతాలలో ఉదయం 6 గంటలకు 6.6ºC ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో రక్నా వద్ద 7.3ºC,  మెబ్రే పర్వతం (8.9ºC),  జబల్ అల్ రహ్బా(9.2ºC), దమ్థా వద్ద 10.2ºC నమోదు అయ్యాయి. ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన జెబెల్ జైస్ శీతాకాలంలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.  ఆడ్రినలిన్ జంకీల కోసం అద్భుతమైన లొకేషన్ 'జెబెల్ జైస్ జిప్‌లైన్‌లు', 'టోబోగాన్ రైడ్'లను కూడా అందిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com