కరోనా పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం..
- December 20, 2023
న్యూఢిల్లీ: భారత దేశంలో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్త వేరియంట్ జెన్.1తోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ..దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సదుపాయాల కల్పన, అంటువ్యాధుల నివారణ చర్యలపై ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









