విదేశీయుల వర్క్ పర్మిట్ల ఫీ పెంపుపై పార్లమెంట్ లో చర్చ

- December 20, 2023 , by Maagulf
విదేశీయుల వర్క్ పర్మిట్ల ఫీ పెంపుపై పార్లమెంట్ లో చర్చ

బహ్రెయిన్: బహ్రెయిన్ పార్లమెంటులో విదేశీయుల వర్క్ పర్మిట్ల ఫీ పెంపుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. దేశంలోని దాదాపు 16,500 మంది విదేశీ కార్మికులు BD1,000+ నెలవారీ జీతంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని కొందరు ఎంపీలు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ వ్యాఖ్యలు విదేశీ కార్మికులను నియమించడానికి ఫీజులను పెంచే ప్రతిపాదనకు ఆజ్యం పోసింది.  బహ్రెయిన్స్‌కు ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. కానీ వాస్తవ విషయాలు మరోలా ఉన్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం.. బహ్రెయిన్ లో ప్రైవేట్ రంగంలో సగటు బహ్రెయిని జీతం కంటే విదేశీ కార్మికుని జీతం మూడు రెట్లు తక్కువగా ఉన్నది.  బహ్రెయిన్‌లకు బిడి 815 ఉంటే నాన్ బహ్రెయిన్‌లకు బిడి 260గా ఉన్నది. సామాజిక భీమా సంస్థ తన ‘స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 - క్వార్టర్ 3’ లో విడుదల చేసింది.ఇందలోనూ బహ్రెయిన్స్‌కు BD450 ఉంటే.. విదేశీ కార్మికుల సాలరీ BD110 గా పేర్కొంది. బహ్రెయినీ గ్రాడ్యుయేట్లు సగటున BD446 సంపాదిస్తుండగా.. నాన్ బహ్రెయినలు BD193 మాత్రమే సంపాదిస్తున్నారు.  అదే సమయంలో బహ్రెయినీ ప్రభుత్వ రంగ ఉద్యోగులు సగటున BD945 సంపాదిస్తున్నారు. కాబట్టి, కొంతమంది విదేశీయులు నిజంగా BD1,000 మార్కుకు చేరుకోగలిగినప్పటికీ, వారు మొత్తం సంఖ్యతో పోలిస్తే ఒక్క శాతం కంటే తక్కువే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వర్క్ పర్మిట్ల ఫీపై బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com