ఖతార్ లో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు

- December 24, 2023 , by Maagulf
ఖతార్ లో ఘనంగా ఏపీ సీఎం జన్మదిన వేడుకలు

దోహా: ఏపీ సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఖతార్ లో అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రాంతానికి అశోక్ రాజు, హబీబుల్లా బాషా ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్నదిన వేడుకలకు అన్నమయ్య జిల్లా, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళి సీఎం కావాలని, వై.ఎస్ జగన్ వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్రం సుభిక్షంగా వుంటుందని ఎంపిపి రాజేంద్రనాద్ రెడ్డి, ప్రవసాందులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వేడుకల్లో సంజీవ్ థామస్, మసీష్, జాఫర్, జయచంద్రన్, మహమ్మద్ నఫ్రాస్, తలాక్, శరత కుమార్, శివ ప్రసాద్, వర్జిల్ బాబు మంది, నరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com