దుబాయ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

- December 25, 2023 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

దుబాయ్: యూఏఈలోని బర్ దుబాయ్ లోని 'జీవముగల దేవుని సంఘం' నందు పాస్టర్ యోహాను సిస్టర్ సుధా ఆధ్వర్యంలో 'సేయోన్ ప్రార్థనా సహవాసం,నర్సీపట్నం రెవ.డా,J. ఆశీర్వాదం ప్రత్యేక ప్రార్థనలతో 'క్రిస్మస్ సందడి' పేరుతో క్రిస్మస్ జన్మదిన వేడుకలు ఘనంగా 'గ్రాండ్ ఎక్స్ ల్సి యర్' హోటల్ లో జరిగింది.ఈ వేడుకల్లో వందలాది మంది పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రసన్న సోమిరెడ్డి మాట్లాడుతూ... ఆ దేవ దేవుని జీవిత సందేశం అయ్యిన ప్రేమ,శాంతి,సౌభతృత్వంను ఎల్లవేళలా కాపాడుకుంటూ,శాంతి కర,ప్రేమ కర జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న అనేక పథకాలను,APNRTS అధ్యక్షులు వెంకట్ మేడపాటి నాయకత్వంలో APNRTS సంచాలకులు బద్వేలు ఇలియాస్ ఆధ్వర్యంలో అమలు పరుస్తున్న పథకాలను వివరించారు.ముఖ్యంగా భీమా పధకం ఆవస్యకతను వివరించి పధకంలో చేరే విధంగా చేశారు.ఈ జన్మదిన వేడుకల్లో YSRCP నాయకులు,సింహాద్రిపురం మొహమ్మద్ జిలాన్ బాషా,శ్రీనివాస చౌదరి,మోహన్ రావు తరపట్ల,నీలిమ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.సంఘ పెద్దలు సాయిబాబు,ప్రసాద్, లక్ష్మణ్,M.ప్రసాద్,మోహన్, రెడ్డి,రమేష్ ఈ ప్రత్యేక కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com